V.C.Sajjanar's post: అమ్మాయిలు జాగ్రత్త.. పెళ్లికి ముందు శారీరక సంబంధాలు వద్దు!

V.C.Sajjanar's post: పెళ్లి అనేది ఇద్దరి మనసులు, రెండు కుటుంబాల ఆశలు కలిసే పవిత్ర బంధం. ప్రేమ, విశ్వాసం, భద్రత అనే మూడు ఆధారాలపై కొత్త జీవిత ప్రయాణం మొదలవుతుంది. అయితే ఈ పవిత్ర బంధాన్నే కొందరు కేటుగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాలకు ఆయుధంగా మార్చుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రేమ వివాహం అయినా, పెద్దలు కుదిర్చిన సంబంధం అయినా పెళ్లి పేరుతో యువతులను మాయలో పడేసి డబ్బు దోచుకునే మోసాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇటువంటి ఫిర్యాదులు గణనీయంగా పెరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ షీ టీమ్స్ కు చేరుతున్న ఫిర్యాదుల సంఖ్య పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో తెలియజేస్తోంది. ఈ...