Manjit Sangha: పెంపుడు కుక్క నాకడంతో కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ

Manjit Sangha: బ్రిటన్‌లో నివసిస్తున్న భారత సంతతి మహిళ జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఎంతో మమకారంతో పెంచుకుంటున్న పెంపుడు కుక్క కారణంగా ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై చివరికి రెండు చేతులు, రెండు కాళ్లు కోల్పోవాల్సి వచ్చిన ఘటన హృదయ విదారకంగా మారింది. సాధారణంగా పెంపుడు జంతువులతో ఆడుకోవడం ఎంత సంతోషాన్ని ఇస్తుందో తెలిసిందే. అయితే చిన్న నిర్లక్ష్యం ఎంతటి ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందో ఈ సంఘటన స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఘటన పెంపుడు జంతువుల యజమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. యూకేలోని వుల్వర్‌హాంప్‌టన్ నగరానికి చెందిన 52 ఏళ్ల మంజిత్ సంఘా గత ఏడాది జూలైలో ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం...