Woman Harassment: 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
Woman Harassment: హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్ పరిధిలో ఓ వివాహితను బెదిరించి లొంగదీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరుకు చెందిన 25 ఏళ్ల యువతి ఉద్యోగావకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చి ఎస్‌ఆర్‌నగర్ ప్రాంతంలో నివసిస్తూ సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో బంజారాహిల్స్‌కు చెందిన మల్లికార్జున్‌రెడ్డి అనే 50 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనంతరం 2024లో ఆమెకు మరో వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొంతకాలం సంబంధం తెగిపోయినట్టే కనిపించినా, గత సంవత్సరం నుంచి మల్లికార్జున్‌రెడ్డి మళ్లీ ఆమెను సంప్రదించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవల మధురానగర్‌లోని ఓ...