Netflix Streaming: వణుకుపుట్టించే సీన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్

Netflix Streaming: హారర్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. వెన్నులో వణుకు పుట్టించే దృశ్యాలు, ఉత్కంఠభరిత కథనం, గుండె దడ పెంచే నేపథ్య సంగీతం ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ తరహా చిత్రాలను చూసేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపుతూనే ఉంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఓటీటీల ద్వారా భయానక కథలు మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇదే తరహాలో తాజాగా ఓ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి అడుగుపెట్టింది. థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. ‘28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్’ పేరుతో రూపొందిన ఈ అమెరికన్ హారర్...