Tragedy: అయ్యో తల్లీ.. ఎందుకిలా చేశావమ్మా!
Tragedy: ఒంటరి జీవిత భారాన్ని మోయలేక ఓ తల్లి తీసుకున్న నిర్ణయం రెండు ప్రాణాలను బలిగొంది. వికారాబాద్ జిల్లా పరిధిలోని యాలాల పోలీస్ స్టేషన్ పరిధి ఇందిరమ్మ కాలనీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భర్తతో విడిపోయి కొడుకుతో ఒంటరిగా జీవిస్తున్న మహిళ, ఆరేళ్ల బాలుడిని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసి అనంతరం తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై విఠల్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇందిరమ్మ కాలనీకి చెందిన బుడగ జంగం గౌరమ్మ (30) తాండూరు పట్టణానికి చెందిన ఫిరోజ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రవికాంత్ (6) అనే కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల...