AP: కొణిదెల గ్రామానికి మహర్దశ.. ఆనందం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
AP: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదెల గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వరుసగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం స్థానిక ప్రజల్లో విశేష ఆనందాన్ని కలిగిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్న ఈ గ్రామానికి ఇప్పుడు కొత్త ఊపిరి లభించినట్టైంది. ముఖ్యంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా తీసుకున్న నిర్ణయం గ్రామ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కొణిదెల గ్రామ...