అమ్మాయిగా మారిన మాజీ క్రికెటర్ కొడుకు .. మరో ఆపరేషన్
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ హార్మోన్ తన వ్యక్తిత్వ ప్రయాణంలో కీలకమైన నిర్ణయం తీసుకుని లింగ మార్పిడి ప్రక్రియను ఆరంభించిన విషయం తెలిసిందే. హార్మోన్ మార్పిడి చికిత్సను కొనసాగిస్తూ తాను అమ్మాయిగా జీవించాలనే తన నిర్ణయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ప్రస్తుతం అనయ బంగర్గా తనను గుర్తించుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా తాను మార్చి నెలలో బ్యాంకాక్‌కు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లు ఆమె వెల్లడించారు. లింగ నిర్ధారణ శస్త్రచికిత్సలో భాగంగా శరీర నిర్మాణంలో మార్పులు చేస్తారు. పురుషాంగం స్థానంలో వెజైనాను ఏర్పాటుచేస్తారు. ఇది అత్యంత నైపుణ్యం అవసరమైన వైద్య విధానం. శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకోవడానికి...