Gold and silver: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold and silver: భారత్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి. వరుసగా 3వ రోజు కూడా ధరలు పెరగడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మేలిమి బంగారం ధర ఒక్కసారిగా రూ.1,900కు పైగా పెరగడంతో మార్కెట్‌లో కలకలం రేగింది. గత 2 రోజుల్లోనే సుమారు రూ.3,000 వరకు పెరిగిన బంగారం రేటు, ఇప్పుడు మరింత ఎగబాకడం సాధారణ వినియోగదారులకు భారంగా మారింది. వివాహాలు, శుభకార్యాలు, పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ప్రస్తుతం ఎదురుచూపులు తప్ప కొనే మార్గం లేకుండా ఉన్నారు. శనివారం ఉదయం 9.30 సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,280...