CRIME: రోజూ తనతో ఆడుకునే పసిపాపపై యువకుడు అత్యాచారం, తర్వాత మరో ఘోరం

సైబర్ సిటీగా పేరుగాంచిన గురుగ్రామ్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల పసిబాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సెక్టార్ 37 పరిశ్రమ ప్రాంతం సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఉన్న గుంట నుంచి బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అమాయక చిన్నారి పట్ల ఇంత దారుణానికి పాల్పడటం సమాజాన్ని కుదిపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు 24 ఏళ్ల యువకుడు. బాలిక కుటుంబం, నిందితుడి కుటుంబం ఒకే భవనంలో నివసిస్తున్నట్లు గుర్తించారు. పరిచయం ఉన్న వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడటం మరింత కలవరపరిచే అంశంగా మారింది. చిన్నారి తరచుగా నిందితుడితో...