Sleeping: మహిళలు లేదా పురుషులు, ఎవరికి ఎక్కువ నిద్ర కావాలి?
Sleeping: ఒక్క రాత్రి సరైన నిద్ర లేకపోయినా దాని ప్రభావం మరుసటి రోజే స్పష్టంగా కనిపిస్తుంది. శరీరం భారంగా అనిపించడం, ఏ పని మీదా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, చిన్న విషయానికే చిరాకు, కోపం రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే తగినంత నిద్ర ప్రతి మనిషికి అత్యవసరమని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే మగవారితో పోలిస్తే మహిళలకు మరింత నిద్ర అవసరమని పరిశోధనలు సూచిస్తున్నాయి. జీవశాస్త్ర పరంగా పురుషులు, మహిళల శారీరక నిర్మాణం, హార్మోన్ల వ్యవస్థ, రోజువారీ బాధ్యతలు భిన్నంగా ఉండటం వల్ల మహిళలకు అదనపు విశ్రాంతి అవసరమవుతుందని నిపుణులు వివరించారు. ఒక అధ్యయనం ప్రకారం.. మహిళల మెదడు రోజంతా చేసే విభిన్న పనుల కారణంగా...