AUS vs OMAN: T20 WC 2026లో ఆస్ట్రేలియా విధ్వంసం

AUS vs OMAN: చివరి లీగ్ పోరులో ఆస్ట్రేలియా జట్టు గర్జించింది. నాకౌట్ అవకాశాలు చేజారినా నిరుత్సాహానికి లొంగకుండా ఒమన్‌పై దుమ్మురేపింది. 105 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో గ్రూప్ బీలో 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఛేదనలో ఓపెనర్లు మిచెల్ మార్ష్ 64 నాటౌట్, ట్రావిస్ హెడ్ 32 చెలరేగిపోయారు. తొలి ఓవర్లోనే మార్ష్ మూడు ఫోర్లతో దూకుడు చూపగా, హెడ్ కూడా బౌండరీల వర్షం కురిపించాడు. 4.1 ఓవర్లకే జట్టు స్కోరు 50 దాటింది. పవర్ ప్లే ముగిసే సరికి 73 పరుగులు సాధించి మ్యాచ్‌ను దాదాపు ఏకపక్షంగా మార్చేశారు. 9వ ఓవర్లో...