Indian Navy: పరీక్ష లేకుండానే ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది!
Indian Navy: దేశ సేవ చేయాలనే సంకల్పం ఉన్న యువతకు శుభవార్త. భారత నౌకాదళంలో 260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల్లో ప్రత్యేకత ఏమిటంటే.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, అకడమిక్ ప్రతిభ, ఇంటర్వ్యూ ప్రదర్శన, మెడికల్ టెస్ట్ అర్హత ఆధారంగా తుది ఎంపిక చేయనున్నారు. దీంతో పోటీ పరీక్షల ఒత్తిడి లేకుండా నేరుగా అధికారిగా చేరే అవకాశంగా యువత దీన్ని భావిస్తోంది. పోస్టును బట్టి అభ్యర్థులు డిగ్రీ, ఇంజినీరింగ్ లేదా పీజీ విద్యార్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగానికి అనుగుణంగా విద్యార్హతలు మారుతాయి. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. ఎత్తు,...