Taliban New Act: భార్యలను భర్తలు కొట్టొచ్చు.. కానీ ఎముకలు విరక్కూడదు

Taliban New Act: భార్యలను తిట్టండి.. పిల్లలను కొట్టండి.. ఎలాంటి తప్పూ లేదు.. కానీ ఒక షరతు మాత్రం పాటించాలి.. ఎముకలు విరిగేంతగా మాత్రం హింసించకూడదు. వినడానికి నమ్మశక్యం కాని ఈ వాక్యాలు వాస్తవంగా చట్టపరమైన నిబంధనలుగా మారితే? ప్రపంచం 21వ శతాబ్దంలో ముందుకు దూసుకుపోతున్న వేళ ఇలాంటి చట్టాలు అమల్లోకి వస్తే? ఇదే పరిస్థితి ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో నెలకొంది. తాలిబన్ పాలనలో కొత్తగా అమల్లోకి వచ్చిన 90 పేజీల క్రిమినల్ కోడ్ దేశంలోని మహిళల భవిష్యత్తుపై తీవ్ర చర్చకు దారితీసింది. తాలిబన్ సుప్రీం నేత హిబతుల్లా అఖుంద్‌జాదా ఆమోదంతో ఈ చట్టం అమలులోకి రావడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే చదువు,...