Trend: పెళ్లి కాకుండానే పేరెంట్స్‌గా మారుతున్న యువత
Trend: చైనాలో ఓ కొత్త సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. సాధారణంగా పిల్లలు ఆడుకునే సాఫ్ట్ బొమ్మలు ఇప్పుడు యువతలో భావోద్వేగ సహచరులుగా మారుతున్నాయి. టెడ్డీ బేర్లు, ఇతర మృదువైన బొమ్మలను తమ జీవిత భాగస్వాముల్లా చూసుకుంటూ వాటికి పేర్లు పెట్టడం, వాటితో రోజువారీ అనుభవాలను పంచుకోవడం అక్కడి యువతలో పెరుగుతున్న ధోరణిగా కనిపిస్తోంది. ఇంట్లో ప్రత్యేక స్థలం కేటాయించడం నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళ్లడం వరకు ఈ అనుబంధం విస్తరించింది. సామాన్య ఆటబొమ్మ స్థాయి దాటి, ఈ బొమ్మలు ఇప్పుడు భావోద్వేగ ఆధారంగా మారిన తీరు సమాజంలో చర్చనీయాంశమవుతోంది. ఈ ట్రెండ్‌తో పాటు కొత్త వ్యాపార అవకాశాలు కూడా రూపుదిద్దుకున్నాయి. సాఫ్ట్ బొమ్మల కోసం...