పెళ్లయిన 2 వారాలకే నెల తప్పిన వధువు.. షాకింగ్ పని చేసిన వరుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా జిల్లాలో సంచలనానికి దారి తీసిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన కేవలం 17 రోజులకే వధువు ఇప్పటికే 2.5 నెలల గర్భవతి అని బయటపడటంతో రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన దంపతుల ఇంట్లో ఈ పరిణామం కలకలం రేపింది. వివాహం జరిగిన 4 రోజులకే యువతి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు గమనించారు. ప్రారంభంలో సాధారణ ఆరోగ్య సమస్యగా భావించిన వరుడు.. నొప్పి మరింత పెరగడంతో ఆమెను సమీప ఆస్పత్రికి తరలించాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు యువతి గర్భవతి అని స్పష్టం చేయడంతో వరుడు షాక్కు గురయ్యాడు. గర్భధారణ...