Taliban Rule: భర్తకు చెప్పకుండా పుట్టింటికి వెళ్తే 3 నెలల జైలు శిక్ష

Taliban Rule: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో మహిళల హక్కుల పరిస్థితి మరింత దిగజారిందనే విమర్శలు అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తున్నాయి. మహిళలను విద్య, ఉపాధి, సామాజిక జీవితం నుంచి దూరం చేసి కేవలం గృహ పరిమితులకే కట్టిపడేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ కోడ్ మహిళల స్వేచ్ఛను మరింతగా కట్టడి చేసే విధంగా ఉందని మానవ హక్కుల వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాలిబన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుండ్‌జాదా ఆమోదించిన 90 పేజీల క్రిమినల్ చట్టపత్రంలో అనేక శిక్షా నిబంధనలు పొందుపరచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, సంచార హక్కులు, కుటుంబ నిర్ణయాల విషయంలో వారి...