Gold Prices: సైలెంట్‌గా షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

Gold Prices: బంగారం, వెండి ధరలు మళ్లీ ఊహించని విధంగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గత కొద్ది రోజులుగా పెద్దగా మార్పులు లేకపోవడంతో ధరలు స్థిరంగా ఉన్నాయనే భావన నెలకొన్న వేళ ఒక్కసారిగా వచ్చిన ఈ పెరుగుదల మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా తులం బంగారం ధర 1 రోజులోనే రూ.2,200కు పైగా పెరగడం, కిలో వెండి ధర రూ.10,000 ఎగబాకడం గమనార్హం. దీంతో ఆభరణాల కొనుగోలు ఆలోచిస్తున్నవారితో పాటు పెట్టుబడిదారులు కూడా లెక్కలు వేసుకుంటున్నారు. ఫిబ్రవరి 19న 24 క్యారట్ బంగారం ధర రూ.2,290 పెరిగి రూ.1,54,200 నుంచి రూ.1,56,490కు చేరింది. ఆభరణాల తయారీలో విస్తృతంగా వినియోగించే 22 క్యారట్ బంగారం...