Chhatrapati Shivaji: మొఘలుల్ని వణికించిన రియల్ వారియర్

Chhatrapati Shivaji: ధైర్యసాహసాలకు ప్రతిరూపం, దేశభక్తికి ప్రతీక, ఆధ్యాత్మిక నమ్మకాలకు ఆదర్శం, స్వరాజ్య సంకల్పానికి స్ఫూర్తి చిహ్నం అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నేడు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడుతోంది. శత్రువుల మధ్యలోనూ ధైర్యంగా నిలబడి స్వతంత్ర రాజ్య స్థాపనకు శ్రీకారం చుట్టిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఆయన నిర్మించిన మరాఠా సామ్రాజ్యం తరువాతి దశల్లో భారతదేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపింది. సమర్థ పరిపాలన, కట్టుదిట్టమైన శాసన విధానం, ప్రజాహితం ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న పాలన ద్వారా శివాజీ మహారాజ్ నేటికీ ఆదర్శ పాలకునిగా గుర్తింపు పొందుతున్నారు. స్వమతాన్ని కాపాడుకుంటూనే ఇతర మతాల పట్ల గౌరవ భావన కలిగి రాజ్యాన్ని నడిపించిన లౌకిక...