T20 World Cup: 8వ ర్యాంక్‌కు దూసుకొచ్చిన ఇషాన్ కిషన్

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో తన అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంటున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారీ ఎగబాకుడు సాధించాడు. బుధవారం ప్రకటించిన జాబితాలో ఇషాన్ ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 8వ ర్యాంక్‌ను సొంతం చేసుకుని టాప్ 10లో స్థానం దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో 158 పరుగులు సాధించిన ఇషాన్.. భారత జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇందులో 2 అర్ధశతకాలు ఉండటం గమనార్హం. ముఖ్యంగా పాకిస్తాన్‌పై 77 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలో నడిపించిన విషయం అభిమానులకు...