Shubalagnam Scene: రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య!
Shubalagnam Scene: డబ్బు కోసం భర్తను భార్య వదులుకోవడం అన్నది ఇప్పటివరకు వెండితెర కథలకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు అదే తరహా సంఘటన నిజ జీవితంలో జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అచ్చం శుభలగ్నం సినిమాలో చూపిన కథను తలపించేలా ఓ భార్య తన భర్తను మరో మహిళకు అప్పగించేందుకు సిద్ధపడింది. ఈ షాకింగ్ ఘటన భోపాల్ నగరంలో చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహ బంధాన్ని డబ్బుతో కొలిచిన ఈ వ్యవహారం సామాజిక విలువలపై తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ సంఘటనకు కేంద్రబిందువైన వ్యక్తి భోపాల్‌కు చెందిన 42 ఏళ్ల పురుషుడు. అతనికి తన కార్యాలయంలో పనిచేసే 52 ఏళ్ల...