Piyush Goyal: 2027 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
Piyush Goyal: భారత్ ఆర్థిక పురోగతిపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఆశావహ అంచనాలను వెల్లడించారు. 2027 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక బలాన్ని స్థిరంగా పెంచుతూ 2047 నాటికి 30-35 ట్రిలియన్ డాలర్ల పరిమాణం గల మహా ఆర్థిక వ్యవస్థను నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముంబైలో నిర్వహించిన గ్లోబల్ ఎకనామిక్ కోఆపరేషన్ సమ్మిట్లో ప్రసంగించిన ఆయన.. ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో బలమైన భాగస్వామ్యాలు, పరస్పర ప్రయోజనాలపై ఆధారపడిన వాణిజ్య సంబంధాల ద్వారా భారత్ అంతర్జాతీయ...