CH Priyanka: అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్ కార్డులు
CH Priyanka: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పాత్రికేయులందరికీ కొత్త గుర్తింపు కార్డులను జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.252 ప్రకారం ఈ గుర్తింపు కార్డుల జారీ విధానం ఒకసారి మాత్రమే కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వార్తా రంగంలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాతో పాటు ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. గుర్తింపు కార్డులు పాత్రికేయులకు అధికారిక ధృవీకరణగా ఉండటమే కాకుండా, ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక సమావేశాలు, సమాచార సేకరణ...