Supreme Court: దుస్తులు విప్పే ప్రయత్నం కూడా అత్యాచారయత్నమే

Supreme Court: లైంగిక నేరాల విచారణలో చట్టపరమైన విశ్లేషణతో పాటు బాధితురాలి పరిస్థితిని అర్థం చేసుకునే సానుభూతి కూడా అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దుస్తులు విప్పే ప్రయత్నం చేయడం, అసభ్యంగా తాకడం వంటి చర్యలను తేలికగా తీసుకోలేమని, ఇవి అత్యాచారయత్న పరిధిలోకే వస్తాయని దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బాధితురాలిపై నిందితులు చేసిన చర్యలను కేవలం తాకడం లేదా పైజామా విప్పే ప్రయత్నంగా పరిమితం చేసి అత్యాచారం లేదా అత్యాచారయత్నంగా పరిగణించలేమన్న హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. లైంగిక నేరాల విషయంలో న్యాయస్థానాలు సూక్ష్మ విషయాలను...