Valio: భారత్‌లో రూ.2,100 కోట్ల పెట్టుబడులకు సిద్ధం
Valio: ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ విడిభాగాల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ వాలియో భారత్‌పై భారీ స్థాయిలో పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించడం దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత మార్కెట్లో తమ ఉనికిని మరింత బలపరిచేందుకు 200 మిలియన్ యూరోలకు పైగా, అంటే మన కరెన్సీలో సుమారు రూ.2,146.18 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని సంస్థ నిర్ణయించినట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ భారీ పెట్టుబడి నిర్ణయం ద్వారా దేశంలో సంస్థ కార్యకలాపాలు గణనీయంగా విస్తరించనున్నాయని, భవిష్యత్ దృష్టితో రూపొందించిన ‘ఎలివేట్ 2028’ కార్యాచరణ ప్రణాళికలో భాగంగానే ఈ అడుగు వేస్తున్నామని కంపెనీ పేర్కొంది. భారత...