CM Revanth Reddy: గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకం
CM Revanth Reddy: ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో హరిత శక్తి కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వాతావరణ వారోత్సవ సదస్సులో ప్రసంగించిన ఆయన, తెలంగాణ ప్రభుత్వం శక్తి ఉత్పత్తి విధానాల్లో మౌలిక మార్పులు తీసుకొస్తోందని వెల్లడించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో హరిత శక్తి వినియోగం ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా పంపుసెట్లు, దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు బొగ్గు వంటి సాంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడిన శక్తి ఉత్పత్తిని దశలవారీగా సౌర మరియు ఇతర హరిత వనరుల వైపు మళ్లించడం...