Marriages: శుభ ముహుర్తాలు వచ్చేశాయ్.. మే 9 వరకు మోగనున్న పెళ్లి భాజాలు..!
Marriages: గత 3 నెలలుగా వివాహాల కోసం అనుకూల శుభ ముహుర్తాలు లేకపోవడంతో, అనేక మంది జంటలు వివాహాలను వాయిదా వేసుకోవడం సాధారణమైపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీతో పాటు శుక్ర మౌఢ్యం ముగియడంతో, ఫిబ్రవరి 18, బుధవారం నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు ప్రారంభమవుతున్నాయి. సాంప్రదాయ ప్రకారం, ఈ సమయం చాలా మంది కోసం సంతోషకరమైన క్షణంగా భావించబడుతుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడు దాంపత్య సౌభాగ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలకు ప్రధానంగా ప్రభావం చూపే గ్రహంగా భావించబడుతుంది. శుక్రుడు సూర్యునికి అత్యంత సమీపంలో ఉండి అస్తమయ స్థితిలోకి వెళ్లినప్పుడు, శుక్ర మూఢమి కాలం ఏర్పడుతుంది. ఈ సమయంలో వివాహాలు,...