Shocking: బోర్డ్ ఎగ్జామ్‌లో జైశ్రీరామ్ అని రాసి పాస్ చేయాలని కోరిన విద్యార్థి
Shocking: ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థి ప్రవర్తనపై షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక సోషియాలజీ విద్యార్థి పరీక్ష పత్రంలో జవాబులు రాయకుండా వదిలేశాడు. సాధారణంగా సమాధానాలను రాయకుండా వదిలిపెట్టడం కొంతవరకు సహజమే, కానీ ఈ సందర్భంలో విద్యార్థి తీసుకున్న చర్య షాకింగ్‌కు గురిచేసింది. విద్యార్థి సమాధానాలను రాయకపోవడమే కాక.. తన పేపర్‌పై ‘బాబర్ తండ్రి శివాజీ మహారాజ్.. జై శ్రీరామ్’ అంటూ నినాదాలు రాశాడు. అంతేగాక, పాస్ కావడానికి 100 రూపాయల నోటును పేపర్‌పై అంటిస్తూ తన అభ్యర్థనను వ్యక్తపరచాడు. ఈ సంఘటనను ఒక వ్యక్తి తన మొబైల్‌లో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా...