High Court: శృంగారంలో పాల్గొన్న తర్వాత పెళ్లి చేసుకోవడం కుదరకపోతే అది నేరం కాదు
High Court: పరస్పర అంగీకారంతో సుదీర్ఘకాలం పాటు కలిసి జీవించిన ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం విఫలమైతే, ఆ తరువాత వివాహానికి పురుషుడు నిరాకరించిన కారణంగా దానిని అత్యాచారంగా పరిగణించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు స్పష్టంచేసింది. సంబంధం కొనసాగిన కాలవ్యవధి, పరస్పర సమ్మతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం వివాహం జరగలేదనే కారణంతో క్రిమినల్ కేసు నమోదు చేయడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. మొదటి నుంచే మోసం చేయాలనే ఉద్దేశంతో తప్పుడు హామీ ఇచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే అది నేరంగా పరిగణించవచ్చని వెల్లడించింది. ముస్సోరీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తనను వివాహం చేసుకుంటానని నమ్మబలికి శారీరక సంబంధం పెట్టుకుని అనంతరం మాట తప్పాడని...