బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్‌గా సిలివేరు శ్రీధర్ యాదవ్

స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్దన్నపేట పట్టణంలోని 11వ డివిజన్‌కు చెందిన సిలివేరు శ్రీధర్ యాదవ్‌కు భారత్ రాష్ట్ర సమితి పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ బాధ్యతలు అప్పగిస్తూ వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి మరింత సమర్థంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పట్టణ స్థాయిలో పార్టీ బలోపేతానికి యువ నాయకత్వాన్ని ముందుకు తేవాలనే లక్ష్యంతో ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు సిలివేరు శ్రీధర్ యాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను...