Post Office: అదిరిపోయే స్కీమ్.. కేవలం వడ్డీతోనే రూ.11లక్షల ఆదాయం
Post Office: ఈ రోజుల్లో చాలామంది తమ కష్టార్జిత డబ్బును భద్రంగా ఉంచాలనే ఆలోచనతో బ్యాంకు పొదుపు ఖాతాల్లో గానీ, ఇంటి బీరువాల్లో గానీ దాచిపెడుతుంటారు. అయితే అలా నిల్వచేసిన డబ్బు కాలక్రమేణా పెరగదు. పైగా ద్రవ్యోల్బణం ప్రభావంతో దాని కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. నేటి పరిస్థితుల్లో డబ్బును కేవలం దాచిపెట్టడం కాకుండా, సరైన ప్రణాళికతో పెట్టుబడి పెట్టడం అత్యంత అవసరం. పెట్టుబడి సురక్షితమా? మూలధనం నష్టపోతుందా? వంటి సందేహాలు సాధారణ ప్రజలను వెనక్కి తగ్గేలా చేస్తాయి. అలాంటి సందేహాలకు ముగింపు పలికే విధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక విశ్వసనీయ పొదుపు సాధనం ప్రజల్లో మంచి ఆదరణ పొందుతోంది. దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల ద్వారా అందుబాటులో...