Love Crime: ప్రియురాలిని చంపేసి.. ఆత్మను పిలిచేందుకు ప్రియుడి తాంత్రిక పూజలు

Love Crime: పెళ్లి విషయంలో తలెత్తిన విభేదాలు ఒక యువతి ప్రాణాలను బలి తీసుకున్న విషాద ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ప్రేమ పేరుతో ప్రారంభమైన పరిచయం చివరికి అనుమానాలు, ఆవేశం, అహంకారం కలగలిసి దారుణ హత్యకు దారి తీసిన సంఘటన కలకలం రేపుతోంది. క్షణికావేశంలో తన ప్రేయసిని గొంతునులిమి చంపిన యువకుడు, కోపం చల్లారిన తర్వాత ఆమెతో మాట్లాడాలని భావించి ఆమె ఆత్మను పిలవడానికి ప్రయత్నించడం మరింత సంచలనంగా మారింది. తాంత్రిక విద్యలపై అవగాహన లేకపోయినా, సోషల్ మీడియాలో లభ్యమయ్యే వీడియోలను చూసి ఆత్మలను ఆహ్వానించే ప్రయత్నం చేశాడనే విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని ద్వారకపూరి ప్రాంతంలో...