Torrur Elections: కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు (VIDEO)

Torrur Elections: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుండగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ చర్యపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రస్తుత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. https://twitter.com/oneindiatelugu/status/2023716306932126032?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2023716306932126032%7Ctwgr%5Ed9a0af96b47bb9e6fd1d1d336fc1fc8b3f709ae5%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Foneindiatelugu%2Fstatus%2F2023716306932126032 తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పోలీస్ స్టేషన్‌కు ఆయనను తరలిస్తుండగా భారీగా చేరుకున్న బిఆర్ఎస్ శ్రేణులు పోలీస్ వాహనాన్ని అడ్డగించాయి. నినాదాలతో ఆగ్రహం వ్యక్తం చేసిన...