Portable ACs: కదిలే ACలు వచ్చేశాయి.. అది కూడా అందుబాటు ధరల్లోనే!
Portable ACs: మరికొన్ని రోజుల్లోనే వేసవి కాలం ప్రారంభమవుతుండగా నగర ప్రజల్లో ఉష్ణోగ్రతలపై ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరంలో ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. భానుడు ఉదయం నుంచే భగభగ మండుతుండటంతో బయటకు వెళ్లడం కష్టమైతే, ఇళ్లలో ఉండడం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. వేడి గాలులు, చెమటలు, ఉక్కపోతతో సాధారణ జీవనం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీలు ఎంతో ఉపశమనాన్ని అందించినప్పటికీ, ప్రతి ఒక్కరూ లక్షల రూపాయలు ఖర్చు చేసి భారీ యంత్రాలను కొనుగోలు చేసే స్థోమత కలిగి ఉండరు. అంతేకాకుండా అద్దె ఇళ్లలో నివసించే వారికి గోడలకు అమర్చే ఏసీలు ఏర్పాటు చేయడం...