Village Incident: ప్రియుడితో పారిపోయిన వివాహిత.. ఆమె భర్త ఏం చేశాడంటే?
Village Incident: వివాహేతర సంబంధం కారణంగా చెలరేగిన వివాదం ఒక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కోపావేశంతో ఆగ్రహం చెలరేగిన ఘటనలో ఒకరికి చెందిన సుమారు రూ.20 లక్షల విలువగల ఇల్లు, గృహోపకరణాలు, వ్యవసాయ యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా గుండాలగడ్డ తండా గ్రామంలో ఆదివారం చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్థులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో మరొక వ్యక్తి కొంతకాలంగా సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం గ్రామ పెద్దల దృష్టికి వెళ్లడంతో పలుమార్లు పంచాయతీలు నిర్వహించారు. సంబంధాన్ని విరమించుకోవాలని, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని పెద్దలు హెచ్చరించినప్పటికీ సంబంధం...