Celebrity Marriage: ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్ అదితి ఎవరు?

Celebrity Marriage: భారత జట్టులో దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన యువ ఆటగాడు ఇషాన్ కిషన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రపంచ కప్ పోటీలతో బిజీగా ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ టోర్నీ ముగిసిన అనంతరం తన సన్నిహిత స్నేహితురాలు అదితి హుండియాను వివాహం చేసుకోనున్నట్లు సమాచారం వెలువడుతోంది. ఈ విషయాన్ని ఇషాన్ తాత అనురాగ్ పాండే వెల్లడించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కుటుంబ పెద్దగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ వార్తకు బలం చేకూర్చాయి. ఇషాన్ ఎవరిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, పిల్లల ఆనందమే...