PMKisan: రైతులకు నెల నెలా రూ.3 వేల పెన్షన్.. ఎవరు అర్హులంటే?

PMKisan: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకాలలో చాలా వరకు రైతులు వ్యవసాయం చేస్తున్నంత కాలానికే పరిమితమవుతుంటాయి. వయసు పైబడిన తర్వాత శరీర శక్తి తగ్గడం, సాగు పనులు చేయలేని పరిస్థితి రావడం, స్థిరమైన ఆదాయ వనరులు లేకపోవడం వల్ల చాలా మంది రైతులు వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాతలకు భరోసాగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కీలక పథకం ఇప్పుడు రైతుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ స్కీమ్‌లో చేరితే వృద్ధాప్యంలో ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయం చేసే...