Warangal Politics: వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్గా పాలకుర్తి సారంగపాణి
Warangal Politics: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలపై నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. చివరి క్షణం వరకు కొనసాగిన చర్చలు, వ్యూహాలు చివరికి కాంగ్రెస్కు అనుకూలంగా మారడంతో చైర్మన్ పదవి ఆ పార్టీ ఖాతాలోకి చేరింది. స్వతంత్రంగా విజయం సాధించిన నేతవత్ శిభారాణి కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడం ఈ ఎన్నికలో కీలక మలుపుగా మారి సంఖ్యా సమీకరణాలను మార్చేసింది. కాంగ్రెస్ చేతిలో చైర్మన్ పీఠం.. సంఖ్యాబలం స్పష్టంగా లేకపోయినా స్థానిక స్థాయిలో పార్టీ నేతలు చురుకైన సమన్వయం చేపట్టి స్వతంత్ర సభ్యులతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో అవసరమైన మద్దతును కూడగట్టడంలో విజయవంతమయ్యారు. ఫలితంగా 7 ఓట్ల ఆధిక్యంతో పాలకుర్తి సారంగపాణి...