Viral photo: విజయ్, రష్మిక పెళ్లి కార్డు ఇదే!

Viral photo: టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. గత కొన్నాళ్లుగా ఈ జంట పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈసారి ఏకంగా వారి వివాహ నిశ్చయ తాంబూలాల ఆహ్వాన పత్రిక వెలుగులోకి రావడం సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ ఆహ్వాన పత్రిక వివరాలు ఇప్పుడు విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26, 2026న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ వేడుకగా జరగనుందని పేర్కొనబడింది. ఈ వేడుకను పూర్తిగా వ్యక్తిగతంగా నిర్వహించాలనే...