Telangana Municipal: పుర పీఠం.. చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డ మున్సిపాలిటీలు ఇవే..

Telangana Municipal: తెలంగాణ రాష్ట్రంలో మేయర్, చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠభరిత వాతావరణంలో సాగాయి. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికల ప్రక్రియ కొనసాగగా, మరికొన్ని మున్సిపాలిటీల్లో అనివార్య కారణాలతో వాయిదా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాల ఏర్పాటు ప్రక్రియకు సోమవారం కీలక దశగా భావించినప్పటికీ, కొన్ని చోట్ల చోటుచేసుకున్న పరిణామాలు అధికారులను అప్రమత్తం చేశాయి. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నప్పటికీ 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల భర్తీ కోసం...