T20 World Cup: భారత్-పాక్ పోరుకు డిజిటల్‌లో సంచలన రికార్డు

T20 World Cup: అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే భారత్- పాకిస్తాన్ పోరు ఈసారి కేవలం మైదానానికే పరిమితం కాలేదు. ప్రపంచ కప్ పోటీగా జరిగిన ఈ సమరయాత్ర డిజిటల్ వేదికలపై కూడా సంచలన చరిత్రను సృష్టించింది. కోట్లాది మంది అభిమానులు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టెలివిజన్ పరికరాలు, ఇతర డిజిటల్ సాధనాల ద్వారా ఈ హై ఓల్టేజ్ పోరును ప్రత్యక్షంగా వీక్షించి అరుదైన రికార్డును నమోదు చేశారు. తాజా గణాంకాల ప్రకారం జియో హాట్ స్టార్ వేదికలో ఈ మ్యాచ్‌ను మొత్తం 454 మిలియన్ల మంది, అంటే 45.4 కోట్ల మంది వీక్షించడం విశేషం. ఇది గతంలో నమోదైన అన్ని రికార్డులను...