Shaitaan: ఈ సినిమా ఉంటది మావా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిందే..
Shaitaan: ప్రేక్షకుల అభిరుచులు రోజురోజుకూ మారుతున్నాయి. ముఖ్యంగా భయానక చిత్రాల విషయంలో ఆడియన్స్లో కనిపిస్తున్న ఆసక్తి ఇప్పుడు స్పష్టంగా గమనించదగ్గది. థియేటర్లకే పరిమితం కాకుండా ఓటీటీ వేదికలపై కూడా హారర్ జానర్ సినిమాలకు విశేష స్పందన లభిస్తోంది. ఉత్కంఠ, మిస్టరీ, మానసిక ఉత్పాతం, అజ్ఞాత శక్తులు ఇవన్నీ కలగలిపిన కథలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఈ తరహా కథలపై దృష్టి సారిస్తూ వరుసగా భయానక చిత్రాలు, వెబ్ సిరీస్లు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబంతో కూర్చొని చూసేలా ఉండే సైకాలజికల్ హారర్ చిత్రాలు ఓటీటీలో ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బాలీవుడ్లో తెరకెక్కిన సంచలన హారర్ థ్రిల్లర్ ‘Shaitaan’ ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది....