School Holiday: రేపు స్కూళ్లకు సెలవు.. ఎక్కడో తెలుసా?
School Holiday: హిందువుల అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటైన మహాశివరాత్రి సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా భక్తి వాతావరణం నెలకొంది. పరమేశ్వరుడికి అంకితమైన ఈ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఉపవాసాలు, జాగారం, శివలింగాభిషేకాలు, రుద్రపారాయణాలు వంటి ఆచారాలు విస్తృతంగా జరుగుతాయి. అయితే 2026 సంవత్సరానికి సంబంధించి మహాశివరాత్రి తేదీపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత గందరగోళం నెలకొన్నది. ఫిబ్రవరి 15నా? లేక ఫిబ్రవరి 16నా? స్కూళ్లకు సెలవు ఏ రోజు? అనే సందేహాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. పంచాంగ వివరాల ప్రకారం.. ముఖ్యంగా దృక్ పంచాంగం ఆధారంగా పరిశీలిస్తే ఈ సంవత్సరం మహాశివరాత్రి తిథి ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ప్రారంభమై,...