Jacqueline: హెలికాప్టర్ గిఫ్ట్ ఇస్తా.. నటికి జైలు నుంచి ఖైదీ లవ్ లెటర్
Jacqueline: దేశ రాజధానిలోని మండోలి జైలు గోడల మధ్య నుంచి వెలువడిన ఒక ప్రేమలేఖ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారీ ఆర్థిక మోసం, మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రాసిన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ నుంచి వచ్చిన ఈ భావోద్వేగ ప్రకటన ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. జైలులో ఉన్నప్పటికీ తన ప్రేమను ఆపలేనన్న ధోరణిలో సుకేష్ రాసిన ఈ లేఖలో అతను జాక్వెలిన్‌ను ముద్దు పేర్లతో సంబోధిస్తూ తన అనురాగాన్ని వ్యక్తం చేశాడు. ఆమెను బొమ్మా, ఏంజెల్,...