Murder: కన్న తల్లిని చంపేసిన తండ్రి.. మైనర్ పిల్లలు ఏం చేశారంటే?

Murder: ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో దారుణమైన కుటుంబ ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల కారణంగా అనిల్ అనే వ్యక్తి తన భార్యను గొంతు కోసి హత్యచేసిన ఘోర ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ దృశ్యాన్ని నేరుగా చూసిన వారి 10, 13 ఏళ్ల కుమారులు భయాందోళనతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న వాదన, ఘర్షణ సమయంలో ఉన్న భయాందోళన, చిన్నారుల మానసిక వేదనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ...