T20 World Cup: నేడే INDvsPAK మ్యాచ్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్

T20 World Cup: ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చేసింది. నేడు టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారతదేశం, పాకిస్తాన్ మధ్య ప్రధాన మ్యాచ్ కొలంబో మైదానంలో జరుగనుంది. ఈ క్రికెట్ పోరు ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు ఉత్కంఠకరమైన క్షణాలను అందించనుంది. అయితే, వాతావరణ పరిస్థితులు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలను చూపిస్తున్నాయి. ఆక్యూవెదర్ వాతావరణ నివేదిక ప్రకారం.. కొలంబోలో ఆదివారం ఉదయం వర్షం కురిసే అవకాశం 93 శాతంగా ఉంది. దీనిలో 26 శాతం అవకాశం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలియజేసింది. సాయంత్రానికి పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉండటంతో, వర్షం ప్రభావం తగ్గుతుందేమో అని క్రికెట్ అభిమానులు వేడుకుంటున్నారు....