పెళ్లికి మంచి ముహుర్తాలు ఇవే..

ధనుర్మాసం, మౌడ్యమి కారణంగా గత కొంతకాలంగా శుభముహూర్తాలు లేక వివాహాలు నిలిచిపోయాయి. మౌడ్యమి రోజుల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించడం శుభప్రదం కాదని పండితులు సూచించడంతో చాలా కుటుంబాలు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నాయి. డిసెంబరు నుంచి కొనసాగిన ఈ విరామం వల్ల పెళ్లిళ్లకు సిద్ధమైన అనేక కుటుంబాలు ఎదురుచూపుల్లోనే నిలిచిపోయాయి. ఇప్పుడు వారికి శుభవార్త వచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి వరుస ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో పెళ్లి సందడి మళ్లీ మొదలుకానుంది. దాదాపు 4 నెలల పాటు అనుకూలమైన తేదీలు వరుసగా ఉండటంతో వివాహ వేదికలు కళకళలాడనున్నాయి. పండితుల ప్రకారం.. ఫిబ్రవరిలో 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో...