AP: స్వర్ణాంధ్ర దిశగా ఏపీ అడుగులు.. రూ.3.32 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్!

AP: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,32,205 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే ద్వంద లక్ష్యాలతో సిద్ధం చేసినదిగా మంత్రి వెల్లడించారు. గణాంకాల సమాహారం మాత్రమే కాకుండా, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన ఆర్థిక ప్రణాళికగా ఈ బడ్జెట్ నిలుస్తుందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. వార్షిక వ్యయం రూ.3,32,205 కోట్లుగా ప్రతిపాదించగా, అందులో రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లు గా నిర్ణయించారు. రెవెన్యూ లోటు రూ.22,022.50 కోట్లుగా, ఆర్థిక లోటు రూ.75,868.09...