Agniveer: 25 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Agniveer: దేశ రక్షణలో భాగస్వాములు కావాలని సంకల్పిస్తున్న యువతకు కీలక ప్రకటన వెలువడింది. భారత సైన్యంలో చేరేందుకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2026కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. దేశసేవ పట్ల ఆసక్తి, నిబద్ధత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ అగ్నిపథ్ పథకం కింద జాతీయ స్థాయిలో నిర్వహించబడనుండటం విశేషం. అధికారిక ప్రకటన ప్రకారం జీడీ, టెక్నికల్, క్లర్క్ లేదా స్టోర్‌కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్, సోల్జర్ ఫార్మా, టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, మహిళా మిలిటరీ పోలీస్ వంటి విభాగాల్లో ఈసారి 25 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. విభాగాలవారీగా అర్హతలు, ప్రమాణాలు...