T20WC: గాల్లోకి పక్షిలా ఎగిరి క్యాచ్ పట్టాడు.. పిచ్చోళ్లయిపోయారంతా (VIDEO)

T20WC: టీ20 ప్రపంచకప్ వేదికగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన సంచలన ఫలితం నమోదైంది. టోర్నీలో బలమైన జట్టుగా భావించిన ఆస్ట్రేలియాపై జింబాబ్వే అద్భుత విజయం సాధించింది. పోటీ అంతా ఉత్కంఠభరితంగా సాగగా, ఒక అద్భుతమైన క్యాచ్ మ్యాచ్ దిశనే మార్చేసింది. ఈ గెలుపుతో జింబాబ్వే జట్టు తమ పోరాటస్ఫూర్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. https://twitter.com/pavijammy/status/2022244237224579297?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2022244237224579297%7Ctwgr%5E6917eb00222c4bac8f7036d014c588942feff4a0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fpavijammy%2Fstatus%2F2022244237224579297 మ్యాచ్‌లో కీలక ఘట్టంగా నిలిచింది జింబాబ్వే ఫీల్డర్ మున్యోంగా పట్టిన అద్భుత క్యాచ్. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా బ్రాడ్ వేసిన బంతిని బ్యాటర్ డ్వార్షూస్ డీప్ మిడ్‌వికెట్ వైపు గట్టిగా కొట్టాడు. బంతి బౌండరీ దాటుతుందని అందరూ భావించిన క్షణంలోనే సుమారు 15 మీటర్ల దూరంలో ఉన్న మున్యోంగా మెరుపు...