Chityala: మున్సిపల్ పోరులో ట్రాన్స్‌జెండర్ ఘన విజయం
Chityala: తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో అరుదైన ఘట్టం నమోదైంది. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో జరిగిన తాజా ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి నాగిళ్ల కావేరి సుధాకర్ విజయం సాధించడం సంచలనం రేపింది. నల్గొండ జిల్లా పరిధిలోని 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె.. ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేసిన ప్రత్యర్థిపై 109 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషంగా మారింది. రాష్ట్ర మున్సిపల్ చరిత్రలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి కౌన్సిలర్‌గా ఎన్నిక కావడం ఇదే తొలిసారి కావడంతో ఈ ఫలితం చారిత్రాత్మక మలుపుగా నిలిచింది. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే భావనకు ఈ విజయం బలమైన సందేశంగా మారింది. ఇప్పటివరకు రాజకీయ ప్రాతినిధ్యం...